సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

5 కోట్లు చెరుకు రైతుల బకాయిలు చెల్లింపులు : డైరెక్టర్ ఖిజర్ యఫై.

5 కోట్లు చెరుకు రైతుల బకాయిలు చెల్లింపులు : డైరెక్టర్ ఖిజర్ యఫై.

జహీరాబాద్,నేటిదిశ: గతేడాది చెరుకు రైతుల బిల్లులను ట్రేడర్స్ చక్కెర పరిశ్రమ యాజమాన్యం విడతల వారీగా చెల్లిస్తూ రైతులకు 7.38 కోట్ల రూపాయలు చెల్లించడంలో జాప్యం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికాలు జారీ చేస్తూ గడువులోగా చెల్లించని పక్షంలో పరిశ్రమను వేలం వేస్తామని ప్రకటించి అందుకు అనుగుణంగానే ఇదే నెలలో ట్రెడెంట్ పరిశ్రమను 28 ఫిబ్రవరి 2024 నాడు వేలం వేయడానికి పలు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్పందించిన ట్రెడెంట్ పరిశ్రమ డైరెక్టర్ ఖిజర్ యఫై మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరి క్రాంతి సమక్షంలో రైతులకు చెల్లించాల్సిన 7.38 కోట్ల బకాయిల్లో 5 కోట్ల రూపాయలు 1973 మంది రైతుల ఖాతాలకు చెల్లించడం జరిగిందని, మిగతా 2.38 కోట్లు సోమవారం నాడు చెల్లిస్తామని డైరెక్టర్ ఖిజర్ యఫై తెలిపారు. ఈ సందర్భంగా ఖిజర్ యఫై మాట్లాడుతూ గత యాజమాన్యంలో ఉన్న కోన్ని లోపల వల్ల రైతులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని, మంగళవారం నాడు 7.38 కోట్ల బకాయిల్లో 5 కోట్లు చెల్లించంచామని, మిగిలిన 2 కోట్లు కూడా వచ్చే సోమవారం నాటికి చెల్లించి రైతులకు ఒక్క పైసా బకాయిలు లేకుండా చూస్తామని అన్నారు.