సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

●ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

జహీరాబాద్ నేటిదిశ: ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొని విద్యార్థి మృతి చెందిన సంఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాంనగర్ కు చెందిన శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్(17) ఆర్ ఎల్ ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బైక్ పై కాలేజీకి వెళుతున్న శ్రీకాంత్ గేట్లోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఝరాసంఘం నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి ప్రథమ చికిత్స కోసం తరలించారు. ఏరియా ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్ వెంటనే ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.అనంతరం సంగారెడ్డి తరలిస్తుండగా విద్యార్థి శ్రీకాంత్ మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.