సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

సైబర్ నేరాలపై కాలేజీ విద్యార్థులకు అవగాహనా సదస్సు •పాలుగోన్నా జిల్లా యస్ పి సిహెచ్ రుపేష్

సైబర్ నేరాలపై కాలేజీ విద్యార్థులకు అవగాహనా సదస్సు
•పాలుగోన్నా జిల్లా యస్ పి సిహెచ్ రుపేష్
జహీరాబాద్, నేటిదిశ :రాష్ట్రంలో రోజు రోజుకు విచ్చలవిడిగా సైబర్, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లోని పీవీర్ గార్డెన్స్ లో జిల్లా యస్ పి సిహెచ్ రూపేష్అద్వర్యం లో డిగ్రీ కళాశాలల విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ లక్కీ డ్రా, కరెంటు బిల్, ఎటిఎం కార్డు రెన్యువల్ అంటూ ఫోన్ చేసి ఓటీపీ లు చెప్పమంటారు ఆలా ఎవరు కూడా ఓటీపీ లు చెప్పకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో పిరియదు చేయాలనీ, అమ్మాయిలకు ఎవరైనా వేధించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా షీ టీం లను సంప్రదించాలని అన్నారు. అలాగే ముఖ్యంగా యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, అలాంటి తప్పులు చేయకుండా తప్పు చేసేటప్పుడు కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాలని మంచి భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్క బండి నడిపే యువకులు లైసెన్స్ పొందాలని లైసెన్స్ పొందిన తర్వాతే రోడ్డుపై బండి నలపాలని ట్రాఫిక్ నిబంధనలో పాటించాలని అన్నారు. నేటి యువతనే రేపటి బావి భారత నిర్మాణ పౌరులని అలాంటి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. యువత వారు చదివే చదువుపై శ్రద్ధ వహించాలని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, జీవితాన్ని పాడు చేసుకోవద్దని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన మత్తు పదార్థాలు విక్రయాలు జరిపిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోపంగా ఉంచుతామని అన్నారు.