సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

సిపిఐ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

నేటి దిశ ప్రతినిధి సదాశివపేట్:తెలంగాణ ఆడపడుచుల పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ పండుగను సదాశివపేట్ సిపిఐ కార్యాలయం ముందు మహిళలు కోలాటం అడుతూ బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సదాశివపేట్ సిపిఐ పట్టణ కార్యదర్శి పి.వినోద మాట్లాడుతూ తరతరాల నుంచి  మన సాంప్రదాయబద్ధంగా వస్తున్న బతుకమ్మ పండుగను మహిళలంతా కలిసికట్టుగా ఈరోజు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సంబరాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని చేసుకుంటే మరీ బాగుంటుంది అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగకు మరింతఎక్కువ నిధులు కేటాయించి ప్రతి ఊరు వాడల బతుకమ్మ సంబరాలు చేసుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముస్తఫా సాదిక్ అలీ. బి కే ఎం యు మండల కార్యదర్శి ముంగి రమేష్ పూలమ్మ రాజమ్మ తుమ్మపూడి బుజ్జమ్మ లక్ష్మీ దేవి బాయ్ బాలమణి రిహనబేగం రాధా తదితరులు పాల్గొన్నారు