నేటి, దిశ అయోధ్య: అయోధ్య నగరం ఐదు శతాబ్దాల తర్వాత కొత్త శోభను సంతరించుకుంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వడివడిగా పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దింది.