సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

సనాతన ధర్మ పరిరక్షకుడు కేసీఆర్: నామ రవికిరణ్

*సనాతన ధర్మ పరిరక్షకుడు కేసీఆర్:
* నామ రవి కిరణ్
*అర్చకుల భృతి పెంచడంపై హర్షం

జహీరాబాద్,నేటి దిశ:తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారని జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ నామ రవి కిరణ్ అన్నారు,బుధవారం రాష్ట్రంలోని ఆలయాలలో దూప దీప నైవేద్యం పథకం క్రింద అర్చకుల గౌరవ భృతి 6000/- రూపాయల నుండి 10,000 /- రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు,ఈ సందర్భంగా నామా రవి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆలయాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. మసీదులు, చర్చిలకు ఆధునిక హంగులద్దేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడం కేసీఆర్ కే సాధ్యమైంది అన్నారు,తాజాగా ఆలయాల్లో పనిచేసే పూజారుల గౌరవ వేతనాన్ని పెంచి వారి కుటుంబాలకు అండగా నిలిచారు అని అన్నారు.అన్ని మతాలు ,వర్గాల పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వాటిని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2023 ఎన్నికల్లో సైతం మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపడుతారని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పాండు ముదిరాజ్, సందీప్ రాజ్, శివ సాయి ముదిరాజ్, నరేందర్ రెడ్డి, ప్రశాంత్ దేశ్పాండే, శ్రీకాంత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.