సంగారెడ్డి జిల్లాలో భూకంపం
నేటి దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో స్వల్పంగా భూకంపం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.దీంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. పెద్ద శబ్దంతో భూమి కల్పించినట్లు చెప్పారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.