సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

సంగారెడ్డి: జహీరాబాద్ చక్కెర కర్మ గరంలో క్రషింగ్ ప్రారంభిస్తాం…

చక్కెర కర్మ గరంలో క్రషింగ్ ప్రారంభిస్తాం: ఎండి రామ్ నాథ్

జహీరాబాద్, నేటి దిశ:ట్రేడెంట్ చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లకు సిద్ధమవుతున్నామని ట్రేడెంట్ చక్కర కర్మాగారం ఎండి రామ్నాథ్ అన్నారు, ట్రేడెంట్ చక్కర కర్మాగారం ఎండి రామ్నాథ్ మాట్లాడుతూ చక్కెర కర్మాగారం లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఖిజర్ యాఫై 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాడని ఆయన అన్నారు, ఇక విడతలవారీగా రైతులకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించి వారి సమస్యలు కూడా తీర్చబోతున్నామని అన్నారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని వారి బాధ తాను అర్థం చేసుకోగలరని వారికి చెల్లించవలసిన డబ్బులు కచ్చితంగా చెల్లిస్తామని అన్నారు, ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపేందుకు రైతులతో పలు విషయాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అందుకు రైతులు కూడా సహకరించి తమతో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని త్వరలో రైతులతో చర్చించే విషయంలో ఒక తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.2023-24 సంబంధించి నాలుగున్నర లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కర్మాగారం విషయంలో యజమాన్యం కర్మగారాన్ని అమ్ముతున్నారన్న పుకార్లను రైతులు,కార్మికులు నమ్మవద్దని ఆయన కోరారు,ఈ సమావేశంలో ట్రేడెంట్ చక్కెర కర్మాగారం యజమాని ఖిజర్ యాఫై పాల్గొన్నారు.