సదాశివపేట్,నేటి దిశ: వికారాబాద్ రోడ్డు నుండి కంభాలపల్లి గ్రామం వరకు ఇటీవల మంజూరైన 1.20 కోట్ల రూపాయలతో బిటి రోడ్డు పనులు కంబాలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీహరి గ్రామస్తులు వార్డు మెంబర్ లతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు, సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ గ్రామానికి వెళ్ళె ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో గతంలో మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ దృష్టి కి తీసుకువెళ్ళడంతో సూమారు 2 కిమీ॥ ల 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వారు తెలిపారు, పనులు ప్రారంభించడం ఆనందాన్ని కలిగించిందన్నారు, వారికి గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామని, అదేవిధంగా మండల పార్టీ అద్యక్షులు పెద్ధగొల్ల అంజనేయులు పంచాయితీరాజ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సుభాష్, వార్డ్ సభ్యులు క్రిష్ణ, గ్రామ శాఖ అద్యక్షులు సుధీర్ రెడ్డి, మల్లేశం, రాములు, వీరయ్య, యాదయ్య, క్రిష్ణ, కుమార్, తదితరులు పాల్గొన్నారు.