విద్యార్దులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి కామారెడ్డి కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా/ సదాశివ నగర్, నేటిదిశ:
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ ఆదర్శ్ పాఠశాలలోవిద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రయత్నించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవన్ అన్నారు మంగళవారం సదాశివనగర్ మండలం ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా ఇంటర్మీడియట్ తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యను లక్ష్యాలతో చదవాలని సూచించారు హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు పాఠశాలలో నడుస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వెంట ప్రిన్సిపాల్ రాజేందర్, తాసిల్దార్ గంగాసాగర్, ఎంపీడీవో సంతోష్, ఎం ఈ ఓ యోసేఫ్ అధ్యాపకులు భానుమతి,రాజశేఖర్, లింగమయ్యలు పాల్గొన్నారు