సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

విద్యార్థులకు నాణ్యమైన విద్యా,భోజనం అందించాలి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా,భోజనం అందించాలి.

• గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

నారాయణఖేడ్,నేటిదిశ:సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్ లో గల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా విద్యార్థుల మరియు గురుకులం ఆధ్యాపకుల హాజరుపట్టిని పరిశీలించారు.విద్యార్థుల చదువు మరియు వారి మార్కులు ఏవిధంగా ఉన్నాయి అని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కుటుంబ సభ్యులను వదిలి పిల్లలు హాస్టల్ లో ఉంటారు కాబట్టి వారందరిని సొంత పిల్లల వలే చూసుకోవాలి అన్నారు.వారికి నాణ్యమైన భోజనం అందించాలని,మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు.ఇతర సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్,గురుకులం అధ్యాపకులు తదితరులు ఉన్నారు.