విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,ఎంపి అభ్యర్థి
నారాయణఖేడ్,నేటిదిశ:నాగల్ గిద్ద మండలం గురుసింగ్ తాండలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం భవాని మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహలను ప్రతిష్టించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వ అయంలో తాండాలో ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని అందించడం జరిగింది అన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలోని అనేక తండాలకు నిధులు మంజూరు చేశాను అన్నారు.ఈ సందర్బంగా తండా వాసులు వారికి ఘనంగా స్వాగతం ఘన స్వాగతం పలికారు.
అనంతరం సప్తహ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖేడ్ జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్,నాయకులు పండరి,లక్ష్మణ్ నాయక్,వెంకట్ నాయక్,తులసి రామ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.