సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి

వస్తున్నా..మీ కోసంతో జనంలోకి చంద్రన్న

ఏసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

న్యాల్ కల్/జహీరాబాద్ , నేటి దిశ:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు, సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని న్యామ్తబాద్, హద్నూర్ , రామతీర్థం ,గుంజటి, మల్కన్ పాడ్, వడ్డీ గ్రామాల్లో వస్తున్నా..మీ కోసం… కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గ్రామ గ్రామన తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అమలు చేయబోయే 6 హామీలను వివరించారు, గ్రామాలలోని సమస్యలను అడిగి తెలుసుకుంటూ పర్యటన చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతినెలా 2500/-రూపాయలు అందిస్తూ..500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు ఎకరాకు 15000/-రూపాయలు, రైతు కూలీలకు 12000/-రూపాయలు అందిస్తూ.. వరి పంటకు క్వింటాకి 500/-రూపాయల బోనస్ అందిస్తామని తెలిపారు. గృహజ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కింద ఇళ్ళు నిర్మించుకునే వారికీ 5లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని ప్రజలకు భరోసా కల్పించారు, యువ వికాసం కింద పేద విద్యార్థులకు ఉన్నత చదువులకోసం 5లక్షల రూపాయలతో ఆర్థిక సహాయం ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. చేయూత పథకం కింద 4000/-రూపాయల పెన్షన్, 10లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమ కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో ప్రజలు విసిగిపోయారు అని ’వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి బి ఆర్ స్, బీజేపీ నుంచి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి అన్నారు. గ్రామాల చిన్న బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు చంద్రశేఖర్ సంవత్సరంలో కాంగ్రెస్లో చేరారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లుపార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.