సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన జగదీశ్వరయ్య

జహీరాబాద్, నేటి దిశ: అంకితభావం క్రమశిక్షణ స్పష్టమైన గమ్యం కఠోర సాధన లక్ష్యం చేదింపులో ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొని ముందుకు వెళితే అసాధ్యం అంటూ ఏదీ లేదని నానుడిని నిజమని నిరూపిస్తూ ఒక మారుమూల గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు  నిరూపించారు, పూర్తి వివరాల్లోకి వెళితే  మొగుడం పల్లి మండల పరిధిలోని అసద్ గంజ్ గ్రామంలోని జగదీశ్వరయ్య ప్రాథమిక పాఠశాలలో జగదీశ్వరయ్య ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తు కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సుసాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ఉపాద్యాయుడు అవార్డును దక్కించుకున్నారు, 2016 లో మొదటిసారిగా అసద్ గంజ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పి జగదీశ్వరయ్య బాధ్యతలు స్వీకరించి పాఠశాలలో కనీస మౌలిక వసతుల కొరతను దాతల సహకారంతో పాఠశాలలో ఫర్నిచర్ సమకూర్చుకొని పాఠశాలలో విద్యార్థులు లేని కొరతను గ్రామంలో ఇంటింటికీ తిరిగి 60 మంది ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో దాదాపు 130 విద్యార్థుల వరకు సంఖ్యను పెంచి విద్యార్థులకు తన సిబ్బందిని ప్రోత్సహిస్తూ విద్యార్థులకు 100 శాతం హాజరయ్యే విదంగా చర్యలు తీసుకోని మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకున్న విధానాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు కోసం హెచ్ ఏం జగదీశ్వరయ్యను ఎంపిక చేశారు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన హెచ్ఎం పి జగదీశ్వరయ్యను జహీరాబాద్ డివిజన్ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గడ్డమీది విజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించాలని ఆకాంక్షించారు.