సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మోతిమత జాతర ఉత్సవాల్లో మంత్రి దామోదర్ రాక

మోతిమత జాతర ఉత్సవాల్లో మంత్రి దామోదర్ రాక

నేటి దిశ,జహీరాబాద్: మొగుడం పల్లి మండల పరిధిలోని ఉప్పర్ పల్లి తండాలో వెలసిన మరిగమ్మ మోతిమత అమ్మవారి జాతరను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ హాజరవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంత్రి దామోదర్ రాజనర్సింహ రాకతో నియోజకవర్గ అధికార గణం మోతిమత మందిరం ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించి ఆలయం ఆవరణలో పనులను చేయించడంతో పరిసరాలు తళుక్కుమన్నాయి. అధికార గణంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయానికి చేరుకొని మోతిమత అమ్మవారిని జాతర మొదటి రోజు బుధవారం నాడు దర్శించుకొని మంత్రి పర్యటన పనులను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్, మండల కో ఆప్షన్ సభ్యులు ఆర్షద్ జామ పటేల్, మొగుడం పల్లి మండల కాంగ్రేస్ అధ్యక్షుడు మాక్సుద్ అహేమద్, ఆలయ కమిటీ బాద్యులు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.