సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

 

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

మెదక్, నేటిదిశ: జిల్లాలోని నాందేడ్ -అకోలా 161 వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడిపెద్ధపూర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ బలంగా ఢీ కొనడంతో బైక్ ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.ఒకే ద్విచక్ర వాహనoపై నలుగురు యువకులు అతివేగంగా, రాంగ్ రూట్లో వెళ్లడమే ప్రమాదానికి కారణమన్నారు. మృతులు పాపన్నపేట మండలం బాచారం గ్రామ వాసులుగా గుర్తించారు.