సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మెకానిక్ షెడ్డులో పేలిన గ్యాస్ సిలండర్

మెకానిక్ షెడ్డులో పేలిన గ్యాస్ సిలండర్
● దగ్ధమైన 7 కార్లు
● భయబ్రాంతులై పరుగులు తీసిన ప్రజలు,విద్యార్థులు
నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ పట్టణంలోని కరస్ గుత్తి రోడ్డులో కాకతీయ పాఠశాల వద్ద గల కార్ల మెకానిక్ షెడ్డులో బుధవారం మధ్యాన్నం 12 గంటల సమయంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో 7 కార్లు దగ్గం కాగా,ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మోహిజ్ ఖాన్ అనే వ్యక్తికి కరస్ గుత్తి రోడ్డులో బానాపూర్ గ్రామ మూలమలుపు వద్ద కార్లను మరమ్మతులు చేసే మెకానిక్ షెడ్డు ఉంది. బుధవారం షెడ్డు యజమాని వేరే పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. షెడ్డులో పని చేస్తున్న వ్యక్తి షెడ్డులో మంటలు రావడం చూసి బయటకు పారిపోతుండగా పెద్ద శబ్దంతో ఓమ్ని కారులోని గ్యాస్ సిలండర్ భారీ శబ్దంతో పెళ్లిపోయింది. పేలిన సిలండర్ సుమారు 1000 గజాల దూరంలో ఇళ్ల మధ్యన పడిపోయింది.అసలే ఎండాకాలం కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి, పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.మంటలు వ్యాపించిగానే అగ్నిమాపకదళ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు రంగప్రవేశం చేసి సుమారు 2 గంటలు కస్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.సిలండర్ పేలడంతో షెడ్డులో మరమ్మత్తుల కోసం ఉంచిన మరో 7 కార్లలో కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దగ్ధo అయ్యాయి.పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు పాఠశాల విద్యార్థులు రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.