సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మానవాళికి ఆదర్శప్రాయుడు శ్రీరాముడు

మానవాళికి ఆదర్శప్రాయుడు శ్రీరాముడు

  • దత్త గిరి పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి
  • 22న ఇంటింటా జ్యోతులు వెలిగించాలని పిలుపు

జహీరాబాద్ ,నేటి దిశ: శ్రీరాముడు ఆదర్శప్రాయుడు సత్యం ధర్మాలను అనుసరిస్తూ పాలన చేశారని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి, సిద్దేశ్వర మహారాజ్ అన్నారు. బర్దిపూర్ గ్రామానికి చెందిన యువకులు, గ్రామ పెద్దలు అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను భజన సంకీర్తనల మధ్య బర్దిపూర్ ఆశ్రమం వరకు ఊరేగింపు నిర్వహించారు. శ్రీరాముని అక్షింతలు తీసుకొచ్చిన గ్రామస్తులకు ఆశ్రమ పీఠాధిపతులు వైది క పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీదత్తాత్రేయ స్వామి వారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి, సిద్దేశ్వర స్వామి మాట్లాడుతూ సమస్త మానవాళికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని అన్నారు. 500 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న శ్రీరాముని భవ్య దివ్య మందిరం నిర్మాణం పూర్తయిందని ఈనెల 22న దివ్యమైన శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద జ్యోతులను వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, నందిని మాత, శివశంకర్ స్వామి,దత్తు స్వామి, వేణుగోపాల్ యాదవ్, కోట వెంకటేశం, గొల్ల మల్లన్న, హరీష్ పాటిల్, జగదీష్,శివపటిల్, వైదిక పాఠశాల విద్యార్థులు గ్రామ యువకులు పాల్గొన్నారు.