మాజీ ఎమ్మెల్యే పరామర్శ
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్, నేటి దిశ:నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి బుధవారం పలువురిని పరామర్శించారు. సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ (నల్లవాగు)గ్రామానికి చెందిన చింతల నర్సింలు అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామ మాజీ సర్పంచ్ గంగారంను పరామర్శించారు.ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు.ఆయనతో పాటు మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్,నాయకులు నర్సింలు,భూషణం, ఆంజనేయులు, గోవింద్,గణేష్, తదితరులు ఉన్నారు.