సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు

మట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు 

◆నిందితుల వద్ద నుండి 1,43,500 రూపాయలు సీజ్.

నేటి దిశ,జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ గ్రామం, జహీరాబాద్ లో మట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ రకాల అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అరికట్టేందుకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు ఏ కసాటిగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ గ్రామానికి చెందిన నాలుగు వ్యక్తులు నిషేధించ బడిన మట్కా ఆడుతున్న 1) యం.కృష్ణ తండ్రి అంజయ్య, 2) కంటి రవి తండ్రి బాబు, 3) కంటి రాజు తండి బాబు, 4) చిలకపల్లీ చంద్రయ్య తండ్రి నర్సయ్య లు, జహీరాబాద్ పట్టణానికి చెందిన మరో ఇద్దరు 1) బోయిని నర్సిములు తండ్రి హన్మంతు, 2) కురేషి యాదుల్ తండ్రి మక్బూల్ కురేషి లను టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు రెండు టీమ్ లుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుండి 1,43,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇక్క ముందు కూడా ఈ దాడులు కొనసాగుతాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.