భూ తగాదాలతో ఒకరి హత్య
• కత్తులు,గొడ్డలితో దాడి
• ఇంకొకరి పరిస్థితి విషమం
నారాయణఖేడ్,నేటిదిశ: నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని చాంద్ ఖాన్ పల్లిలో సోమవారం ఉదయం జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడి తండ్రి అంకం లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..చాంద్ఖాన్ పల్లిలో తనకు మరియు బాబుగొండ మల్లయ్యకు పక్కపక్కనే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి ఉందని,భూమి సరిహద్దు విషయంలో అనేక ఏళ్లుగా ఇరువురo గొడవ పడుతూ ఉన్నాము అన్నారు.గత కొద్ది మాసాల క్రితం సరిహద్దులో గల రాళ్ల విషయంలో గొడవలుపడి కోర్టును ఆశ్రయించడంతో ఇరువురు కూడ భూమిలోకి వెళ్ళరాదని 6 నెలల క్రితం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అన్నారు. భూమి కేసు కోర్టులో ఉండగా బాబుగొండ మల్లయ్య సరిహద్దు లోని చెట్లను ఇతరులకు అమ్మివేసి నరికివేసిన చెట్లను సోమవారం ఉదయం ట్రాక్టర్ లో తరలిస్తుండగా తాను, తన సోదరుడు అంకం రాములు,కొడుకు అంకం అశోక్ లు ట్రాక్టర్ ను అడ్డుకోగా బాబుగొండ,అతని ఇద్దరు కుమారులు మరో 7 మంది హఠాత్తుగా కత్తులు, గొడ్డలితో దాడి చేశారు అన్నారు.దాడిలో తన కుమారుడు అంకం అశోక్(38) అక్కడికక్కడే మరణించాడని,తన అన్న అంకం రాములుకు తీవ్రగాయాలు అయ్యాయి అన్నాడు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని మార్చురికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.