సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

భారీగా పలికిన మొదటి టీజీ నెంబర్

భారీగా పలికిన మొదటి టీజీ నెంబర్

హైదరాబాద్, నేటిదిశ:తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇక టీజీ పేరుతో మొదలయ్యాయి. స్పెషల్ నంబర్ల కోసం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అధికారులు ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదారబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు తొలి రోజు ఆర్టీఏ అధికారులు ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించగా.. అనూహ్య స్పందన వచ్చింది. ఓ వాహనదారుడైతే.. ఏకంగా ఓ నంబర్ కోసం రూ. 9.61 లక్షలు పెట్టి సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని గెలుపుతోంది. ఈ ధరతో ఆయన ఇంకొక కారు కూడా కొనుకోవచ్చు. ఖైరతాబాద్లో నిర్వహించిన బిడ్డింగ్లో టీజీ 090001 నెంబర్ కోసం రుద్ర రాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని ఇంత మొత్తంలో వెచ్చించారు. ఇది తొలి టీజీ నంబర్ అని తెలుస్తోంది. ఇక టీజీ 09 0909 నెంబర్ కోసం భవ్య సింధు ఇన్ ఫ్రా సంస్థ రూ. 2.30 లక్షలు చెల్లించి దక్కించుకుంది. శాన్వితా రెడ్డి అనే వాహన యజమాని టీజీ 09 0005 నెంబర్ కోసం రూ. 2.21 లక్షలు ఖర్చు పెట్టారు.