– భవిష్యత్తు కార్యాచరణ సిద్దమైన ఢిల్లీ
– సోమవారం ఆత్మీయ సమ్మేళనం
– వివిధ పార్టీల అసంతృప్తుల తో చర్చలు
జహీరాబాద్, నేటి దిశ :
గత తొమ్మిది రోజులుగా వివిధ స్థాయిలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సామాజిక ఉద్యమకారులు జయహో జహీరాబాద్ నినాద కర్త ఢిల్లీ వసంత్ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు, ఇప్పటికే జహీరాబాద్ ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితిలో పోటీ చేస్తానని తెగేసి చెప్పిన ఢిల్లీ వసంత్ గత కొన్ని రోజులుగా తన అంతరంగికులతో, వివిధ సంఘాలతో, రైతులతో, కార్మికులతో, మండలల నాయకులతో చర్చించారు, దళిత బందు పై తన వర్గానికి జరిగిన తీవ్ర అన్యాయంపై గొంతు విప్పాడు. యువతకు ఉపాధి, చెరుకు రైతుల సమస్యలపై ఇప్పటికే ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఆయన, ఇప్పటివరకు తాను ఇచ్చిన దళిత బంధు లిస్ట్ పై ఒక్కరికి కూడా న్యాయం చేయకపోవడంపై భగ్గుమని తన అసహనాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్ కార్యాచరణ కోసం జహీరాబాద్ పట్టణంలోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో సోమవారం భారీ సమావేశంచేనునట్టు వెల్లడించారు, ఇందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నాయకులను కూడా సంప్రదిస్తున్నారు,జహీరాబాద్ నుండి ఢిల్లీ వరకు చేసిన పాదయాత్ర వల్ల చెరుకు రైతులకు వందల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేసినప్పటికీ తన నిస్వార్థమైన సేవలను జహీరాబాద్ ప్రజలు అర్థం చేసుకొని భవిష్యత్తు కార్యాచరణలో సహకరించ వలసిందిగాప్రజలకు రైతులకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో ఢిల్లీ వసంత్ బృంద సభ్యులు రైతు నాయకులు బిల్లి పురం మాధవ్ రెడ్డి, విశాల్ గోడ్కే, కృష్ణ, యాసీర్ ఖాన్, అశోక్ పాటిల్, నారాయణ, శివ ప్రసాద్ మాదినం, జైపాల్, పాపన్న, రాజు, విష్ణు, ఓంకార్, శ్రీనివాస్ ముదుగొండ్ల, స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.