సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్న అనిల్ కుమార్

బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్న అనిల్ కుమార్
జహీరాబాద్, నేటిదిశ: ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగమైన జహీరాబాద్ కేంద్రంగా ఏర్పడిన పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమకారుడు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ గురువారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్నారు. బి ఫామ్ అందజేసిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గల్లో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నందున అందరిని సమన్వయం చేసుకుంటూ కష్టపడితే విజయం ఖాయం అని అన్నారు. బి ఫామ్ అందుకున్న ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ నాపై విశ్వసన్నీ ఉంచి జహీరాబాద్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ఇంచార్జ్ తన్నీరు హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజామోదం పొంది విజయం సాధించడానికి అందరి సహకారంతో శయశక్తులు కృషి చేసి విజయం సాధిస్తానని అన్నారు.