సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

బిఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే కొనింటి మణిక్ రావు

బిఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే కొనింటి మణిక్ రావు

జహీరాబాద్, నేటిదిశ: అరునూరైన నూరుఆరైన బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బిఆర్ఏస్ పార్టీలోనే ఉండి మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోనే ముందుకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని, 2023 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చే వరకు విశ్రమించేది లేదని,
సీఎం రేవంత్ రెడ్డి మా పార్టీ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అంటున్నారని, మొదలు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీల గేట్లు తెరవలని, మహాలక్ష్మి పథకం 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్న ఆ.. గేటు ఎత్తండని,రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది ముందు ఆ గేటు ఎత్తండని, కౌలు రైతులకు రూ. 12 వేలు ఇస్తామన్నారు మందు ఆ గేట్లు ఎత్తలని, అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు మందు ఆ గేటు ఎత్తలని, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు వద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, రైతులకు ఒకే సారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినా హామీని పూర్తి చేయాలని,ఉద్యోగులకు డీఏ లేదని, నిరుద్యోగ భృతి లేదు ముందు ఆ గేట్లు తెరవాలని,కేసిఆర్ పాలనలో పచ్చని పంట పొలాలు ఉంటే, కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు తగులుతున్నాయని,ప్రతిపక్షంలో ఉన్ననాడు ఎవరైనా రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలని ?అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే మణిక్ రావు డిమాండ్ చేశారు.