బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా
జనగాం, నేటిదిశ :జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసిఆర్ కు పంపించారు. పార్టీ విధానాలు నచ్చకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు.