ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, నేటి దిశ:నిజాంపేట్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందుతున్నాయా?లేవా? రోగుల పట్ల డాక్టర్లు మరియు సిబ్బంది ప్రవర్తన ఏ విధంగా ఉంది అని రోగులకు వారి సహాయకులకు అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారికి ఉచిత వైద్యం అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు రాజేశ్వర్, సిబ్బంది,మండల నాయకులు మన్నే కృష్ణ,గోలి రాములు, రఘుపతిరెడ్డి, రాధాకిషన్,వెంకటేష్,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.