సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ప్రమాద బాధితులకు లక్ష ఆర్థిక సహాయం అందించిన ఎంపీ బిబి పాటిల్

ప్రమాద బాధితులకు లక్ష ఆర్థిక సహాయం అందించిన ఎంపీ బిబి పాటిల్

జహీరాబాద్, నేటిదిశ: ఆపదలో ఉన్న కుటుంబానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ ఆపన్న హస్తాన్ని అందించారు. సంగరెడ్డి జిల్లా శాసనసభ పరిధి జహీరాబాద్ మండలంలోని డిడిగి గ్రామానికి చెందిన సోనాయిల ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులై కుటుంబం ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయన్ని స్థానిక ఎంపీ బిబి పాటిల్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎంపీ వెంటనే వారికి తగిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి భవిషత్తులో అన్ని రకాలుగా అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందుకున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఎంపికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రమాదంలో గాయపడటం దురదృష్టకరమని, ప్రమాదంలో గాయపడిన చిన్నారి, ప్రశాంత్, కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని, భవిషత్తులో వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న జేకే కన్స్ ట్రాక్షన్, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, గుంజేటి ఎంపిటిసి దేశెట్టి పాటిల్ ప్రమాద బాధితులకు తోచిన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.