సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎంపి

ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎంపి
నారాయణఖేడ్,నేటిదిశ:సంగారెడ్డి – నాందేడ్ 161వ జాతీయ రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ స్వయంగా ఆసుపత్రికి తరలించారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణఖేడ్ లో సమావేశం ముగించుకొని ఆందోల్ వెళ్తుండగా అల్లాదుర్గ్ మండలం చిల్వర్ గ్రామం వద్ద జాతీయ రహదారి పైన ఆగి ఉన్న లారీని ట్రాన్స్పోర్ట్ లారీ ఢీ కొట్టడం వలన డ్రైవర్ ఇంజన్ భాగం లో ఇరుక్కుపోవడం చూసి కాన్వాయ్ ని ఆపారు.ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించి,మెదక్ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి పరిస్థితిని వివరించారు.ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ అనంతపూర్ జిల్లాకు చెందిన విజయనాథ్ గా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని ఎస్పీ మరియు జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు.అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.