సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

జహీరాబాద్, నేటి దిశ: గత వారం క్రితం దిగ్విజయంగా ముగిసిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ లో న్యాయ సలహాదారుగా ఉండి టౌర్ని విజయవంతంగా సాగడంలో తన విలువైన సమయాన్ని కేటాయించి టౌర్నికి అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించి నిర్వాహకులకు అన్ని రకాల అండగా ఉన్నందుకు గాను ఏజిపి శ్రీనివాస్ రెడ్డికి ఖిజర్ యఫై గోల్డ్ కప్ నిర్వాహక అధ్యక్షుడు మొహమ్మద్ మాక్సుద్ అలీ, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ బృందం పూలమాల శాలువకప్పి జ్ఞపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది గుడుపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో ఇంత చక్కటి టౌర్ని నిర్వహించడం అభినందనీయం అని, భవిషత్తులో ఖిజర్ యఫై ఇలాంటి మరిన్ని టౌర్నీలో నిర్వహించాలని, క్రికెట్ తో పాటు ఫుట్ బల్, వాలీబాల్ లాంటి టౌర్నీలో నిర్వహించి స్థానిక క్రీడాకారులను ప్రోత్సాహించి రాష్ట్రీయంతో పాటు జాతీయస్థాయిలో క్రీడకరులుగా రాణించేందుకు సామాజిక నాయకులు ఖిజర్ యఫై కృషి చేయాలని ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం పద్మశాలి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం జనార్దన్ కి పూలమాల శాలువకప్పి టౌర్ని జ్ఞపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ మాట్లాడుతూ స్థానిక క్రీడాకారులకు ఖిజర్ యఫై గోల్డ్ కప్ ఒక సువర్ణ అవకాశం అని, కులమతాలకు అతీతంగా టౌర్నికి ముఖ్య అతిధులుగా తమను ఆహ్వానించడం జహీరాబాద్ క్రీడా చరిత్రలో ఇదే మొదటిసారి అని, తమకు ఇంతపెద్ద అవకాశం కల్పించిన ఖిజర్ యఫైకి కృతజ్ఞతలు అని పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మాక్సుద్ అలీ, విజయ్ రాథోడ్, అబ్దుల్లా సిద్దిఖీ, మొహమ్మద్ పాష, అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.