పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన: ఏఐఎఫ్ బి అభ్యర్థి
నారాయణఖేడ్,నేటిదిశ:జహీరాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థిగా ఏ.ఐ.ఎఫ్.బి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) పార్టీ తరపున పోటీ చేస్తున్న గుఱ్ఱపు మచ్చెందర్ నారాయణఖేడ్ పట్టణ శివారులోని అంత్వార్ కు వెళ్లేదారిలో ఆదివారం నాడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. విద్య,వైద్యంపై పోరాటం సాగిస్తామన్నారు.ఉన్నత చదువులు చదివి, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న గత పాలకులు ప్రజాసేవా పేరుతో ప్రజలను మోసం చేయడం తట్టుకోలేక రాజకీయంలోకి వచ్చాను అన్నారు. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి గెలిచిన తరువాత ప్రజా సమస్యలను గాలికి వదిలివేస్తున్నారు అన్నారు.75 ఏళ్ల పాలనలో నారాయణఖేడ్ లో రైతులకు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం దారుణం అన్నారు.10 ఏళ్లలో మోడీ పేదరికం నిర్మూలన కోసం ప్రత్యేక బిల్లు తీసుకురాలేదు అన్నారు.అనేక మంది యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెళ్లలేక పోతున్నారు అన్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరలు ఇప్పిస్తానని,కల్తీ విత్తనాలు,మందులు లేకుండా చర్యలు తీసుకుంటానని,నీటి సమస్యలు లేకుండా చూస్తానని,పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అన్నారు.ఈనెల 23న నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలి అన్నారు. ఫలితాలు ఎలా ఉన్న ఎన్నికల తరువాత కూడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్నారు.మే నెల 13న జరిగే ఓటింగులో పార్లమెంట్ పరిధిలోని ప్రజలు సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో పనిచేయాలని అనుకునే వారికోసం పార్టీ అవకాశం కల్పిస్తుందని, భవిష్యత్తులో వారు రాజకీయంగా ఎదగడానికి పార్టీ సహకరిస్తుంది అన్నారు.స్వచ్ఛందంగా పార్టీలో పనిచేయాలి అనుకునేవారు 9346351646,9345001264,9030599439 నంబర్లకు సంప్రదించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో అనుచరులు,మద్దతుదారులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.