నేడు జహీరాబాద్ కు చంద్రశేఖర్ రాక
* స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
* రాజనెల్లిలోఆత్మీయులతో సమావేశం
* ప్రార్ధన మందిరాల్లో పూజలు
జహీరాబాద్, నేటి దిశ: కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ తన సొంత నియోజకవర్గంలో సోమవారం వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నట్లుకోహిర్ మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు రామలింగారెడ్డి తెలిపారు, కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా చంద్రశేఖర్ రావడంతో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లో జోష్ పెరిగింది, చంద్రశేఖర్ రాక కోసం ఇప్పటికేభారీగా ఏర్పాట్లు చేశారు,కోహిర్ మండలంలోని బడంపేట్ శ్రీరాచన్న స్వామి ఆలయాన్ని సందర్శించిప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోహిర్ మండల కేంద్రంలో గల దర్గాను సందర్శిస్తారు,వారి సొంత గ్రామం లో రాజనెల్లి లో విలేకరుల సమావేశానికి హాజరుకానున్నారు,