సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

నాలల పై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

నాలల పై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

కాస్త వర్షానికి చెరువును తలపిస్తున్న జోగిపేట్ బస్టాండ్.

మొద్దు నిద్రలో మున్సిపల్ అధికారులు.

అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు.

అందోల్,నేటి దిశ: అందోల్ , జోగిపేట మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ నుండి అందోల్ చెరువులోకి కలిసే ఓపెన్‌ నాలాపై ఉన్న స్థలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టాడాలపై చర్యలు తీసుకోవాలని జోగిపేట పట్టణవాసులు కోరుతున్నారు. కూరగాయల మార్కెట్, బస్టాండ్ నుండి దయానంద్ రోడ్డుని కలుపుతూ అందోల్ చెరువు లోకి వెళ్లే ఒపెన్‌ నాలా సుమారు 1600 మీటర్లున్న నాలాను  ఆక్రమించి కొంత మంది అక్రమ కట్టడాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగువ ప్రాతంలో చెరువు ఉండడంతో వర్షాలు విస్తారంగా కురిస్తే వరద నీరు వీధుల్లోకి చేరి ఇంట్లోకి చేరుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాలపై అక్రమనిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో బస్టాండ్ మొత్తం నీటమునగడంతో రోడ్డు గుంతలమయంగా మారాతుందని బస్టాండ్ లోపలికి వాహనాలు రావడానికి ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందోల్ జోగిపేట మున్సిపల్ లో  చాలా సంవత్సరాలనుండి నాలాళ్లను పునఃనిర్మాణం చేపట్టిన దాకలాలు లేవు. నాలాలు ఆక్రమణకు గురై కుచించుకపోవడంతో వరద నీటి సమస్య తలెత్తుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాలాలను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనునట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అందోల్ జోగిపేట పట్టణ వాసులు కోరుతున్నారు.

పట్టింపులేని అధికారులు..

ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు అన్నివివరాలు పరిశీలించాల్సి ఉంది. కానీ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు లంచాలకు కక్కుర్తిపడి నిబంధనలు అతిక్రమించి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. కొందరు ఇంజినీర్‌ ప్లాన్‌పై బల్దియా నుంచి అనుమతి తీసుకుని, ఆ తర్వాత సమీపంలోని మురుగునీటి కాలువలు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో వర్షపునీరు, మురుగునీరు వెళ్లేదారిలేక ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.

నీట మునిగిన జోగిపేట బస్టాండ్

ఆదివారం కురిసిన వర్షానికి బస్టాండ్ నీట మునిగింది. అలాగే పోచమ్మ ఆలయ గర్భగుడిలోకి మురికి నీరు చేరడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేప్పట్టడంతో కాలువలు బురదతో కూడుకుపోవడంతో వర్షపు నీరు ఎటు వెళ్లలేక జోగిపేట బస్టాండ్ లో నిలిచిపోవడంతో సముద్రాన్ని తలపించింది.ఈ వర్షపు నీరు నిలువ ఉండటంతో ప్రయాణికులు ఎక్కడ గోతులు ఉన్నాయో అని అవస్థలు పడుతున్నారు..