సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

నాగిలిగిద్దా మండలంలో ఖాళీ అయినా బిఆర్ఎస్

నాగిలిగిద్దా మండలంలో ఖాళీ అయినా బిఆర్ఎస్
*కాంగ్రెస్ లో చేరిన ఎంపిపి
నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిలిగిద్దా మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యిందని చెప్పుకోవచ్చు. మండల జడ్పీటీసీ రాజు రాథోడ్ మొన్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, బుధవారం నాడు మండల ఎంపిపి మోతిభాయి రాథోడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బాలాజీలు కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్బంగా మాజీ ఎంపి సురేష్ శెట్కార్ వారికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కేవలం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమని,కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారెంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ లో చేరడం జరిగింది అన్నారు.వీరితో పాటు మరో 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి.ఈ కార్యక్రమంలో శంకరయ్య స్వామీ, మాణిక్ రెడ్డి,సోపాన్ రావ్ తదితరులు ఉన్నారు.

పెద్దశంకరంపేట్ లో …….
మండలంలోని ఉత్తులూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి వీరాగౌడ్ తో పాటు 30 కుటుంబాలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్బంగా అయన వారికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుసూదన్, నాయకులు నారాయణ గౌడ్,రవీందర్, పెరుమాలు గౌడ్, గంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.