నేటి దిశ ప్రతినిధి హత్నూర : వాకిటి సునితా లక్ష్మారెడ్డి గారికి కెసిఆర్ గారు BRS నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీ. వీ. శివశంకరరావు గారు మరియు కార్యకర్తలు హత్నూర మండలంలోని హత్నూర గ్రామంలో మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా బీ. వీ. శివ శంకర్ రావు మాట్లాడుతూ సునితమ్మ ద్వారా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి అండ దండలతో కలిసి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన KCR గారికి నర్సాపూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సునీతమ్మ గారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొల్ల యాదయ్య ఆకుల నరేందర్, ఆకుల మల్లేష్, ఎనగండ్ల నర్సింలు, యాదగిరి, నల్లోళ్ళ ఎల్లయ్య, పొట్లగళ్ల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.