దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పట్టించుకోని మల్చేల్మా సహకార బ్యాంక్
జహీరాబాద్, నేటిదిశ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జూన్ 2, 2014 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్ది ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించాలనే ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన, మల్చల్మా సహకరా సొసైటీ బ్యాంకులో నిర్వహించకపోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను మల్చేల్మా సహకార బ్యాంక్ పాటించకపోవడం గమనార్హం. ఆవిర్భావ వేడుకల్లో అన్ని ప్రభుత్వ, ప్రజా సంబంధమైన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని అలపించగా, మల్చేల్మా సహకార బ్యాంక్ లో జాతీయ జెండాను ఎగురవేసే సంగతి అటుంచిన కనీసం సొసైటీ కార్యాలయాన్ని తెరవకపోవడం విడ్డురం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించని మల్చేల్మా సహకార బ్యాంక్ సొసైటీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై స్థానిక మల్చేల్మా సొసైటీ బ్యాంక్ చైర్మన్ బుచ్చిరెడ్డిని సంప్రదించగా తమకు సమాచారం లేదని చెప్పగా, వైస్ చైర్మన్ షేక్ ఇమాం పటేల్ ని సంప్రదిస్తే తమకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఆహ్వానం లేదని అన్నారు. ఇంత ముఖ్యమైన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించని సొసైటీ కార్యదర్శి కేశవ రెడ్డి తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం విశేషం. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోయినా కనీసం అధికారులు వేడుకలు నిర్వహించాలనే ఇంగిత జ్ఞానన్ని మర్చిపోవడం విడ్డురం. చూడాలి అధికారులు ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటారో లేక ఏమి కాదని పెడచెవిన పెడతారో వేచి చూడాలి.