తుల్జాపూర్ కు బర్దిపూర్ యువకుల పాదయాత్ర
– 5 రోజుల పాటు పాదయాత్ర
– 200 కిలోమీటర్లు కొనసాగుతున్న పాదయాత్ర
– పౌర్ణమికి దర్శించుకునే అవకాశం
జహీరాబాద్, నేటి దిశ: ఝరా సంగం బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీ భవాని మాత భక్తులు మహారాష్ట్రలో సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ భవాని ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు, ముందుగ శ్రీ దత్తగిరి యూత్ సభ్యులు బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయల్దేరారు, సుమారు 21 మంది యువకుల బృందం పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది, 5 రోజులపాటు వీరి పాదయాత్ర కొనసాగునుంది, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మీదుగా తుల్జాపూర్ శ్రీ భవాని మాత ఆలయానికి వీరి పాదయాత్ర చేరుకొనుంది. పౌర్ణమి రోజు బర్దిపూర్ భవాని భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది.