డప్పుర్..”భూ నిర్వాసితుల వినూత్న నిరసన”..!
డప్పుర్..”భూ నిర్వాసితుల వినూత్న నిరసన”..!
న్యాల్ కల్, నేటిదిశ: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం డప్పుర్ గ్రామానికి చెందిన ఫార్మసిటీ భూ నిర్వాసితులు వినూత్నంగా నిరసన చేపట్టారు. శనివారం గ్రామస్తులతో పాటు వడ్డీ మల్గి గ్రామాలకు చెందిన రైతులు కళ్ళకు నల్ల రంగు రుమాలు (బట్ట) ధరించి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ.. ఫార్మాసిటీ నుండి మా భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.