జీవితం పై విరక్తి తో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
జీవితం పై విరక్తి తో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా,నేటి దిశ:
జీవితం పై విరక్తి తో పురుగుల మందు సేవించి యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగాపుర్ గ్రామానికి చెందిన చాకలి రాము(27). గత పది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కు రాడ్డు వేశారని తెలిపారు. అప్పటి నుంచి ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఈ మేరకు ఈ నెల 20 న జీవితం పై విరక్తి చెంది గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.