సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

జహీరాబాద్ లో బిఆర్ఎస్ కు బిగ్ షాక్..

జహీరాబాద్ లో బిఆర్ఎస్ కు బిగ్ షాక్..
– బిఆర్ఎస్ చెందిన 250 కాంగ్రెస్ లోకి
– బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్

జహీరాబాద్, నేటి దిశ:జహీరాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది, జహీరాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖదీప్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనతోపాటు భరత్ నగర్ కాలనీవాసులు బిఆర్ఎస్ నాయకుడు ఖదీర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ భరత్ నగర్ కాలనీలో రోడ్లు మురికి కాలువలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఇప్పటివరకు సరిగ్గా రోడ్లు వేసిన దాఖలాలు లేవని అందువల్ల ఖదీర్ ఆధ్వర్యంలో 250 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు, కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారనిఅన్నారు, పారిశ్రామికంగా జహీరాబాద్ అభివృద్ధి చెందుతున్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తనను గెలిపిస్తే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.