జహీరాబాద్ పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీకి నిరసన సెగ
• ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్తాం
• ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌస్,కాలనీ వాసులు
జహీరాబాద్, నేటిదిశ:ఎన్నికల ప్రచారరం చేపడుతున్న బిఆర్ఎస్ నాయకులకు నిరసన సెగ తగిలింది . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ఫయాజ్ నగర్ కాలనీలో ఈ నెల 13న జరగబోయే ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పట్టణ మాజీ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సయ్యద్ మోహియోద్దీన్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ మరియు బి ఆర్ ఎస్ నాయకులను ఫయాజ్ నగర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ గౌస్,కాలనీ వాసులు అడ్డుకున్నారు. గడిచిన పది సంవత్సరాలు అధికారంలో యుండి తమ కాలోనిలో మరుగు కాలువల, రోడ్లల పరిస్థితి దయనీయంగా ఉందని ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని మా కాలోనికి వచ్చారని బి ఆర్ ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. అదేవిదంగా మా కాలోనిలో గత పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. ఇట్టి విషయాన్ని ఎన్నో సార్లు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లిన ఇప్పటి వరకు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినట్టుగా ఉందని అన్నారు. ఎంపీ ఎన్నికలో బి ఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దింతో చేసేదేమి లేక ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మెల్లగా అక్కడి నుండి జారుకొన్నారు.