జహీరాబాద్, నేటి దిశ : న్యాల్ కల్ మండలంలోని మల్గి గ్రామ శివారులోని శ్రీ శ్రీ శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు పూజలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ జె.మారుతి, ఎంపిటిసి శివానంద,శ్రీపతి ,ఆలయ కమిటీ సభ్యులు సిద్దు ,తుకారం, బాలాజీ గౌడ్ ,కార్తీక్ ,యువజన నాయకులు మారుతి, మహేష్, నగేష్, సందీప్, సునీల్, మల్లేష్ భక్తులు పాల్గొన్నారు.