సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

 

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
*పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
నారాయణఖేడ్,నేటిదిశ:శ్రీరామ నవమి సందర్బంగా నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన సతీమణి అనుపమ రెడ్డితో కలిసి పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం జరిగింది.ఆలయంలో ఉదయం నుండి భక్తుల సందడి మొదలయింది. ఈ సందర్బంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మాజీ ఎంపి సురేష్ శెట్కార్ ప్రత్యేక పూజలు………
రామాలయంలో జహీరాబాద్ మాజీ ఎంపి,ఖేడ్ మాజీ ఎమ్మెల్యే సురేష్ శెట్కార్ సీతారాముల కళ్యాణం సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శెట్కార్,కాంగ్రెస్ జిల్లా నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, యువ నాయకులు సాగర్ శెట్కార్,మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్ వివేకానంద, నాయకులు శంకరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.