ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి
ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి
• అప్పం శ్రవణ్ కుమార్.
జహీరాబాద్, నేటి దిశ :భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ బోధించిన ఏకాత్మవాదం, అంత్యోదయ సిద్ధాంతాలు నేటికీ ఆదర్శనీయమైనవని అని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, గొల్ల భాస్కర్, జిల్లా నాయకులు ప్రొద్దుటూరు శ్రీనివాస్, శోభారాణి, మంజుల కౌలాస్, వంశీ సూర్య, కాశీనాథ్ ,నాగరాజు ,సంతోష్, బాలు, ఫణీంద్ర, మహేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.