సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

గెలుపు మనదే

గెలుపు మనదే

  • ఎంపి బిబి పాటిల్
  • ఏ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకొమ్మలు
  • కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి.

నారాయణఖేడ్,నేటిదిశ:భారత దేశంలో బీజేపీ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రాబోతుందని అందుకు ప్రతీ కార్యకర్త ఎంపి అభ్యర్థిగా భావించి కష్టపడి పనిచేయాలని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎచ్.ఆర్ ఫంక్షన్ హాలులో బిజెపి 7 నియోజకవర్గాల పరిధిలోని క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బిబి పాటిల్ మాట్లాడుతూ..దేశంలో మూడవసారి అధికారంలోకి బిజెపి రావడం పక్కా అని,అందుకోసం బూతుకమిటీలు బాగా పనిచేయాలి అన్నారు.అందరం కలిసి ఐక్యమత్యంగా పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపి స్థానాన్ని కానుకగా ఇద్దాము అన్నారు.10 ఏళ్ల కాలంలో నారాయణఖేడ్ లో ఎంపి నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టాను అన్నారు.నిజాంపేట్ నుండి బీదర్ వరకు జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి అన్నారు.40 కులాలను ఓబిసి కార్పొరేషన్ లోకి చేర్చడానికి కృషి చేస్తున్నాము అన్నారు.వెనుకబడిన కంగ్టి మండలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించానని అనుకోని కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయమే లక్ష్యంగా పార్టీ విజయం కోసం పనిచేయాలి అన్నారు.దేశ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళాలి అన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ..ప్రతీ గ్రామ,మండలాల మోర్చా మరియు మండల అధ్యక్షులను వెంటనే నియమించుకోవాలి అన్నారు. గ్రామాలు,మండలాలలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? ఎన్ని ఓట్లు వేయిస్తాము అని కొలబద్ధ పెట్టుకోవాలి అన్నారు.మొత్తం 18లక్షల ఓట్లలో మోదీ పేరుపై 3లక్షల ఓట్లు సులువుగా వస్తాయని, మరో 6 లక్షల ఓట్లు వచ్చేలా చూడాలి అన్నారు.ప్రజల వద్దకు నాయకులు వెళ్లాలని,ప్రతీ గ్రామంలో పట్టుసాధించాలని,తూతూ మంత్రంగా ప్రచారం చేస్తే కుదరదని,నోటిఫికేషన్ మొదలుకొని ఓటింగు వరకు గ్రామాలు, పట్టణాలలోనే నాయకులు,కార్యకర్తలు ఉండాలి అన్నారు.అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ..కేవలం 30రోజులలో 60 మండలాలు,7 నియోజకవర్గాలు అభ్యర్థి తిరిగి ప్రచారం చేయడానికి సమయం సరిపోదు కాబట్టి ప్రతీ నాయకుడు,కార్యకర్త అభ్యర్తిగా భావించి కష్టపడి పనిచేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో అభిషేక్ పాటిల్,నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ,నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి సంగప్ప,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణతార, బీజేపి నాయకులు వడ్డేపల్లీ సుభాష్ రెడ్డి,రవిగౌడ్,మురళీయాదవ్, బిడేకన్నే హన్మంతు,రజినీకాంత్, సాయిరాం,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.