సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

గాడి తప్పిన పురపాలక వ్యవస్థ

గాడి తప్పిన పురపాలక వ్యవస్థ

• వార్డులలో ఎక్కడేసిన గొంగడి అక్కడే.
• వీధి దీపాలు పాడై నెలలు గడిచిన మరమ్మత్తు చేయడంలో విఫలం.
• అసిస్మెంట్ (ఇంటి నెంబరు మంజూరు), మోటేషన్ (పేరు మార్పిడి )కోసం మండుటెండల్లో నెలల తరబడి ప్రజల పడిగాపులు.
• ముడుపులు ముడతే గాని  ముందుకు సాగని ఫైలు ..
• మంత్రి సమీక్షించిన ఫలితం శూన్యం.
• మండిపడ్డ బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్.

జహీరాబాద్, నేటిదిశ: గొప్పలు బారేడు పనులు మాత్రం మూరెడు అన్న పరిస్థితి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘంలో ఏర్పడింది. జహీరాబాద్ పురపాలక పరిధిలోని పాత 24 వార్డులు మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాలతో కలిపి 37 వార్డులలో గత కొన్ని నెలల నుంచి పారిశుద్ధ్యం, వీధి దీపాలు ఏర్పాటు ప్రజా సమస్యలు తీర్చడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానిక మాజీ కౌన్సిలర్ నామ రవి కిరణ్ మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ అధికారులు చేసే నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా నిలిచిపోతుందని అన్నారు. నూతనంగా మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో ఇంటి అసెస్మెంట్ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నారు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు కేవలం చేతులు తడుపుతే గాని జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు కావడం లేదని అన్నారు. స్థానిక వార్డులలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు పాడైపోయిన కనీసం ఇప్పుడు వాటిని మార్చే సిబ్బంది కూడా కరువయ్యారని గత మాసంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు.. జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, జాతీయ రహదారిపై పలు వాణిజ్య కేంద్రాలకు సంబంధించిన నిర్మాణాలు ఏర్పడ్డాయి.. నిర్మాణాలు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణాలకు ఆస్తిపన్నును కేటాయించి వసూలు చేయడం లేదు,, అధికారుల ఉదాసీనేత వలన మున్సిపాలిటీకి కోట్ల రూపాయలలో వచ్చే ఆదాయం కోల్పోవలసి వస్తుంది .. ఇప్పటికైనా జిల్లా ఇంచార్జ్ మంత్రి , కలెక్టర్ జహీరాబాద్ పురపాలక సంఘంపై శ్రద్ధ వహించి పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు ఇబ్బంది కల్పించకుండా వారి పనులను త్వరగా పూర్తి చేయాలని పట్టణంలో,విలీన గ్రామాల్లో కూడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చూడాలని సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నామ రవి కిరణ్ డిమాండ్ చేశారు.