సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

కోటి రూపాయలు విలువ అయిన ఎండు గంజాయి స్వాధీనం- జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్.

కోటి రూపాయలు విలువ అయిన ఎండు గంజాయి స్వాధీనం.

సంగారెడ్డి,నేటిదిశ: జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ ఆదేశాల మేరకు సోమవారం నాడు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహనాల తనిఖిలలో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న 190 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ మీడియాతో అన్నారు. నిందితుల నుంచి ఎండు గంజాయి మరియు రెండు కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే రెండు కార్లలో గల ఐదుగురు వ్యక్తుల వివరాలు పోలీసులు అడిగి తెలుసుకోగా బ్రీజా కారు ఓనర్ మరియు డ్రైవర్ రాపర్తి సతీష్ తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఇ.సి.ఐ.యల్ లో నివాసం ఉంటాడు.సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గత 5 సంవత్సరాలుగా తన సొంత కారు నందు వైజాగ్ ప్రాంతం నుండి హైదరాబాద్- ముంబాయి హైవే మీదుగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలల్లో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.అలాగే సతీష్, గణేష్ లు 150 కిలోల గంజాయిని బీదర్ లో ఉన్న జియా, షబ్బీర్ లకు అమ్మడానికి బీదర్ వెల్లుతుండగా, అహ్మద్ మొహమ్మద్ ఆలం లు 40 కిలోల గంజాయిని ముంబాయిలో అమ్మడానికి వెళుతున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. ఈ ఎండు గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ ఇన్స్పెక్టర్ శివలింగం, మహేష్ గౌడ్, ఎస్.ఐ సాయిలు, హెచ్.సి.లు ఇస్మాయిల్, శంకర్, రేక్య నాయక్, గౌరి, పి.సి. లు అన్వర్, శశిధర్, నెల్లూర్, శ్రీహరి, నర్సింలు, హరి మరియు అరవింద్ లను జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్ లు ప్రకటించారు.
ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ సి.హెచ్ రూపేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఎవరైనా గంజాయి అమ్మిన గంజాయి సేవించిన అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.