సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

కొండెక్కిన కోడి….!!

కొండెక్కిన కోడి….!!
సదాశివపేట,నేటిదిశ: చికెన్ ధర చూస్తే కెవ్వు మనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడం తో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకో వాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకు న్నాయి.బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. నిన్న, ఈరోజు అమాంతం పెరిగిపోయింది.కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగ దారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు.ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500 కు పైగా అమ్ముతున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపుఎండతీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతు న్నారు.ఆదివారం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముక్కలేకపోతే ముద్దది గదు. ఆదివారం సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి.తాజాగా ధరల పెరుగు దలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.