కాంగ్రెస్ లో భారీగా చేరికలు
• కాంగ్రెస్ లో చేరిన BMP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
• పెద్దశంకరంపేట్ నుండి 600 మంది చేరికలు. నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల సంఖ్య రోజురోజుకు పెరిగుతుంది. సోమవారం ఖేడ్ లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 1500 మందితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్బంగా మాజీ ఎంపి సురేష్ శెట్కార్,ఖేడ్ MLA సంజీవ్ రెడ్డి,మాజీ MLC రామలు నాయక్ లు వారందరికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ప్రకాష్ రాథోడ్ మాట్లాడతు.. తెలంగాణ పేరు మీద కెసిఆర్,మతం పేరుతో దేశ ప్రజలను మోడీ మోసం చేసారు అన్నారు.రాష్ట్రం,దేశం అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీ మెజార్టీతో గెలపించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తాహెర్ ఆలీ, నెహ్రు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట్ నుండి 600 మంది చేరిక…….
పెద్దశంకరంపేట్ మండలంలోని మూసాపేట్, కమలాపురం, ఆరెపల్లి,లక్ష్మపురం మరియు పెద్దశంకరంపేట్ గ్రామాలకు చెందిన సుమారు 600 మంది బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలను వీడి ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.వారందరికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర మరియు దేశ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ వల్ల మాత్రమే సాధ్యమని నమ్మి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్నారు.