సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

కట్టుకున్న భార్యను కడితేర్చిన కసాయి భర్త

నేటి దిశ,నారాయణఖేడ్: కట్టుకున్న భార్యను కడితేర్చిన కసాయి భర్త జీవితాంతం కష్టసుఖాలలో తోడుంటానని ప్రమాణం చేసిన కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను హత్య చేయించిన సంఘటన నారాయణఖేడ్ లో చోటు చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.శుక్రవారం స్థానిక సిఐ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణానికి చెందిన సయ్యద్ అబ్దుల్ యూనుస్ తన మొదటి భార్య బ్రతికి ఉండగానే అంజుమ్ బేగంను రెండవ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలను స్వంత ఇంట్లో ఉంచి, రెండవ భార్య మరియు కూతురును పట్టణంలోని మార్కెట్ గల్లీలో అద్దె ఇంట్లో ఉంచేవాడు అన్నారు. మొదటి భార్యా పిల్లలను స్వంత ఇంట్లో ఉంచి నన్ను అద్దె ఇంట్లో ఎందుకు ఉంచుతున్నావు నాకు కూడా సొంత ఇల్లు కావాలని, ఆస్తిలో వాటా కావాలని రెండవ భార్య అడుగుతున్నందున ఆస్తిలో వాటా ఇవ్వకూడదు అంటే భార్య అడ్డు తొలగించుకోవాలని భర్త యూనుస్ పథకం పన్నాడు అన్నారు.తేదీ: 06.01.2024 నాడు యూనుస్ అతని అన్న కొడుకు అయూబ్ తో మీ రెండవ చిన్నమ్మ అంజూమ్ బేగం సగం వాటా కావాలని, కొత్త ఇల్లు కొనాలని చాలా రోజుల నుండి గొడవలు చేస్తున్నది, ఎలాగైనా నువ్వు అంజూమ్ బేగంను చంపేయ్, నీకు ఎంత డబ్బు అయిన ఇస్తానని,నిన్ను దుబాయి పంపిస్తానని,పోలీసు కేసు అయితే, నేను చూసుకుంటాను నువ్వేమి బయపడకని అయూబ్ ను ఉసిగొల్పాడు అన్నారు.అందుకు ఒప్పుకున్న అయూబ్ 08.01.2024 నాడు మధ్యాహ్నం 2.00 గం.లకు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి అంజూమ్ బేగం రూమ్ దగ్గరికి వెళ్ళి,అతని స్నేహితునికి అక్కడే గది బయట ఉంచి అయూబ్ ఒక్కడే అంజూమ్ బేగం రూమ్ లోకి వెళ్లి బెడ్రూం లో ఉన్న ఆమెపై విచక్షణరహితంగా ఆమె కంటి పైన నుదుటిపైన,ముఖంపై గట్టిగా పిడి గుద్దులు గుద్దుతూ, ఆమె స్పహ తప్పి పడిపోగానే బెడ్ రూమ్ నుండి కిచెన్ రూమ్ లోకి లాక్కెల్లి ప్లాస్టిక్ వైపర్ తో తలవెనుక గట్టిగా కొట్టినాడు అన్నారు.కొంత సేపటికి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆయూబ్ గది నుండి బయటికి వచ్చి,అంజూమ్ బేగంను చంపిన విషయం యూనుస్ కు ఫోన్ ద్వారా తెలిపినాడు అన్నారు. ఆ తర్వాత హత్య చేసిన ఇద్దరిని యూనుస్ బీదర్ పంపించాడు అన్నారు.తన సోదరిని ఎవరో హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు మొహమ్మద్ పాష పిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా కట్టుకున్న భర్తనే హత్య చేయించినట్లు విచారణలో తెలింది అన్నారు.12వ తేదీ శుక్రవారం హత్య చేసిన వారు నారాయణఖేడ్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఉన్నట్లు సమాచారం అందగా సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకొని పోలీస్టేషన్ కు తీసుకోచ్చి విచారించడం జరిగింది అన్నారు.పోలీసుల విచారణలో హత్య చేసిన ఆయూబ్ నిజాలు ఒప్పుకున్నాడని,అంజుమ్ బేగంను హత్య చేయించింది కట్టుకున్న భర్త యూనుస్ అని తెలిపాడు అన్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.